13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అసెంబ్లీలో ‘సన్నబియ్యం’ ఘుమఘుమలు

31-03-2026 12:33 AM

విందు ఆరగించిన సీఎం, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని డైనింగ్ హాలులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలకు సన్నబియ్యంతో ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు.

పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రేషన్ షాపుల ద్వారా సామాన్యులకు అందుతున్న అదే నాణ్యమైన బియ్యంతో వండిన పదార్థాలను ప్రజాప్రతినిధులందరికీ వడ్డించారు.

ఈ విందులో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని, మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో కలిసి సన్నబియ్యం భోజనం చేశారు. అనంతరం వారు సన్నబియ్యం విందు భలే బాగుందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కితాబిచ్చారు. పేదలకు అందుతున్న బియ్యం నాణ్యత ఏ విధంగా ఉందో ఈ సందర్భంగా ఆయన స్వయంగా పరిశీలించారు. ఇక సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.