28 July, 2026 | 6:07 AM

కాంట్రాక్టర్ల సమ్మెతో నిలిచిపోతున్న పనులు

30-05-2024 01:38 AM

మాన్‌సూన్ పనులకు రీకాల్ చేస్తున్న బల్దియా 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో కాం ట్రాక్టర్లు చేపడుతున్న నో పే.. నో వర్క్ నిరసన కార్యక్రమం 12 రోజులుగా కొనసాగు తోంది. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా పను లు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం వానాకా లం సీజన్ కావడంతో బల్దియా మాన్‌సూన్ ప్రణాళికలో భాగంగా చేపడుతున్న పనులు దాదాపు అన్ని సర్కిళ్లలో నిలిచిపోయాయి.  ఇప్పటికే ఇంజినీర్ ఇన్ చీఫ్ జీయాఉద్దీన్ తదితర అధికారులు చర్చించి నా బిల్లులు చెల్లించే దాకా పనులు చేపట్టమని కాంట్రాక్టర్లు పట్టుదలను ప్రదర్శిస్తున్నా రు. పలు సర్కిళ్లలో మాన్‌సూన్ పనులు నిలిచిపోతున్న కారణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు చేసేదేమీ  మళ్లీ రీకాల్ చేస్తున్నారు. 

నిలిచిపోతున్న పనులకు రీకాల్..

జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,500కు పైగా ఉన్న కాంట్రాక్టర్లకు గతేడాది కాలంగా రావాల్సిన రూ.1,350 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించాలంటూ ఈ నెల 18 నుంచి నో పే .. నో వర్క్ అంటూ సమ్మెకు దిగారు. దీంతో క్షేత్రస్థాయిలో మాన్‌సూన్‌కు సంబంధించిన ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పనులు చేసేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంజి నీర్లు ఆ పనులకు టెండర్లు రీకాల్ చేస్తున్నా రు. అంతేకాకుండా ప్రస్తుతం టెండర్ల నోటిఫికేషన్ దశలో ఉన్న ఎలాంటి పనులకు కాం ట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయడం లేదు.

ముషీరాబాద్, అంబర్‌పేట సర్కిల్ స్థాయిలో వివిధ పనులకు వేసిన టెండర్లకు ఈ నెల 30 (గురువారం) నాటికి గడువు ముగుస్తు న్నా..బుధవారం నాటికి ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు.  మాన్‌సూన్‌లో గ్రేటర్‌వ్యాప్తంగా 150 వార్డుల్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల పనులు జరగనున్నా యి. కానీ ప్రస్తుతం అవన్నీ నిలిచిపోతుండ టం తలనొప్పిగా మారింది. కాంట్రాక్టర్ల సమ్మెతో సికింద్రాబాద్ జోన్ పరిధిలోని మల్కాజిగిరి, ఆనంద్‌బాగ్ డివిజన్లు, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్ పల్లి వార్డులో పలు పనులతో పాటు హయత్‌నగర్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో పనుల నిమిత్తం జీహెచ్‌ఎంసీ అధికారులు రెండు నుంచి నాలుగు సార్లు టెండర్లకు రీకాల్ చేయడం విశేషం. 

బెదిరింపులకు పాల్పడుతున్నారు  

 మాకు రూ.1,350 కోట్ల బిల్లులను చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే వడ్డీల భారం అధికమవుతుంది. రావాల్సిన బిల్లులు ఇవ్వకుండా ఇంకా పనులు చేయాలంటే మేం చేయలేకపోతున్నాం. 12 రోజుల సమ్మెతో  వందల కోట్ల పనులు నిలిచిపోతున్నాయి. మమ్మల్ని ఒప్పించి పనులు చేయించాలని ఇంజినీరింగ్ అధికారులకు కమిషనర్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అంతేకాకుండా పనులు చేపట్టకుంటే గతంలో చేసిన పనుల బిల్లులు విజిలెన్స్‌కు ఇస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.  

 రాజేశ్, కాంట్రాక్టర్