calender_icon.png 6 July, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులు ప్రారంభించాలి.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

15-10-2024 01:45:28 PM

కూకట్‌పల్లికూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కూకట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ను కలిసి విన్నవించారు. పార్కులు, గ్రేవియార్డ్, కమ్యూనిటీ హాల్స్ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అవసరమైతే వాటికోసం ప్రత్యేక నిధులు కేటాయించి పనులను ప్రారంభించాలన్నారు. సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ అపూర్వ చాహన్ వీలైనంత త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చెన్నారెడ్డి, డీఇ గోవర్ధన్ లు పాల్గొన్నారు.