23 July, 2026 | 8:58 AM

పదవి నుంచి తప్పించండి

06-06-2024 12:38 AM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం

ముంబై, జూన్ 5: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్ర నుంచి ఎన్టీఏ కూటమికి తక్కువ సీట్లు వచ్చినందుకు నైతిక బాధ్యత వహించి డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పుకుంటానని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ మేరకు త్వరలో ఢిల్లీ పెద్దలను కలిసి తన నిర్ణయాన్ని తెలియజేస్తానని పేర్కొన్నారు. ఇకపై బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తాననని తెలిపారు. ముంబైలో బుధవారం మాట్లాడుతూ.. తాజా ఎంపీ ఎన్నికల్లో ఎన్డీఏకు సీట్లు తగ్గడంపై ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, రైతుల వ్యతిరేకత ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని స్పష్టం చేశారు. ముస్లింల ఓటింగ్ అసలే లేకపోవడం మరో కారణమన్నారు. అలాగే మరాఠా ఉద్యమం బాగా దెబ్బతీసిందని అభిప్రాయపడ్డారు. ముఖ్య మంత్రి ఏక్‌నాథ్, షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో కొన్ని బీజేపీకి సమన్వయ సమస్యలు ఉన్నా యని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.