23 July, 2026 | 9:47 AM

9న సిక్కిం సీఎం ప్రమాణం

06-06-2024 12:34 AM

రెండోసారి ప్రమాణం చేయనున్న తమాంగ్

32 స్థానాలకు 31 సీట్లు గెలుచుకున్న ఎస్‌కేఎం

గ్యాంగ్‌టక్, జూన్5: సిక్కింలో అద్భుతమైన విజయం సాధించిన క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం)అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ జూన్ 9వ తేదీన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. రెండోసారి సీఎంగా ఆయన ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లోని పల్జోర్ స్టేడియంలో ఆయన ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్య క్రమానికి పెద్ద  ఎత్తున ప్రజలు, ఎస్‌కేఎం పార్టీ కార్యకర్తలు హాజరుకాను న్నారు. ఐదేళ్ల కింద ఇదే స్టేడియంలో తొలిసారిగా సీఎంగా ప్రమాణం చేశా రు. ఈసారి భారీ విజయం నమోదు చేసుకోవడంతో సెంటిమెంట్‌గా ఇక్కడే మరోసారి ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌కేఎం 32 స్థానాలకు ఏకంగా 31 స్థానాలు గెలుచుకుని ప్రభంజనం సృష్టించారు. ఆయన రాజకీయ గురువు పార్టీ అయిన సిక్కిం డెమొక్రటిక్ పార్టీని ఒకే స్థానానికి పరిమితం చేసి దేశం చూపును తనవైపు తిప్పుకొన్నారు. కాగా, సిక్కింలో ఉన్న ఒకే ఒక లోక్‌సభ స్థానాన్ని కూడా ఎస్‌కేఎం కైవసం చేసుకుంది.