6 August, 2026 | 2:30 AM

నీళ్లు తాగిన దేవేంద్రనాథ్

06-08-2026 12:48 AM
  1. సోనమ్ వాంగ్‌చుక్ విజ్ఞప్తి మేరకు నిర్ణయం
  2. వీడియో కాల్‌లో మాట్లాడిన సోనమ్
  3. విద్యార్థుల పోరాటానికి మద్దతు
  4. ఆరోగ్యం కాపాడుకుంటూ ఉద్యమం కొనసాగించాలని సూచన 

రాంచీ, ఆగస్టు 5: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్‌ఎస్‌సీ) పరీక్షల్లో అక్రమాల ను నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తు న్న విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతో తన దీక్షలో భాగంగా నీళ్లు తాగారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ విజ్ఞప్తి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్‌లను నిరసిస్తూ రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వేది కగా విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు జూ లై 29 నుంచి నిరవధిక దీక్ష, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 

నిరసనకారుల ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో బుధవారం దేవేంద్రనాథ్ మహతో సోనమ్ వాంగ్‌చుక్ పది నిమిషాలు  వీడియో కాల్‌లో మాట్లాడారు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఆందో ళన కొనసాగించాలని సూచించారు. కనీసం నీటినైనా తీసుకోవాలని వాంగ్‌చుక్ కోరడంతో దేవేంద్రనాథ్ మహతో అందుకు అంగీకరించారు.

నీళ్లు మాత్రమే తీసుకున్నానని, ప్రభుత్వం తమ డిమాండ్లు పూర్తిగా నెరవేర్చే వరకు ఎలాంటి ఆహారం తీసుకోబోనని మహతో తేల్చిచెప్పారు. ఢిల్లీలో విద్యార్థుల నిరసన కార్యక్రమాలకు సోనమ్ అందించిన మద్దతును ఈ సందర్భంగా మహతో గుర్తు చేశారు. అదే తరహా మద్దతు ఇప్పుడు జార్ఖండ్‌లో కూడా తమకు కావాలని ఆయన కోరారు. సోనమ్ వాంగ్‌చుక్ రాంచీకి వచ్చి తమను ప్రత్యక్షంగా కలిస్తే దీక్ష విరమించే అంశాన్ని పరిశీలిస్తానని తెలిపారు.  

జార్ఖండ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉధృతం చేశారు.  14వ జేపీఎస్‌సీ పరీక్షలను రద్దు చేయాలని, జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ వ్యవస్థల్లో సమూల ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థులు పట్టుపట్టారు.

న్యాయం జరుగుతుంది: జార్ఘండ్ సీఎం

విద్యార్థుల ఆందోళనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పందించారు. అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని, నిరసనకారులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. పరీక్షల అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు జార్ఖండ్ పోలీసుల సీఐడీ విభాగం 14 మందిని అరెస్టు చేసిందని తెలిపారు.  జేపీఎస్‌సీ నిర్వహించాల్సిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.  ఇదిలా ఉండగా