6 August, 2026 | 2:32 AM

ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి నో

06-08-2026 12:48 AM

ఉద్యమ వేదికగానే కొనసాగుతాం

పార్టీ కంటే ప్రజాపోరాటాలకే ప్రాధాన్యం 

సీజీపీ వ్యవస్థాపకుడు అభిజిత్ 

జార్ఘండ్ విద్యార్థుల ఉద్యమానికి అండగా నిలుస్తాం

ముంబై, ఆగస్టు 5: ప్రస్తుతం రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన లేదని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే శక్తిగా పని చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. యువత, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే తమ ఉద్యమ లక్ష్యమని పేర్కొన్నారు. జార్ఖండ్‌లో జేపీఎస్‌సీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సీజేపీ మద్దతు ప్రకటించింది.

అవసరమైతే తమ పార్టీ ప్రతినిధులు నేరుగా జార్ఖండ్‌కు వెళ్లి విద్యార్థుల ఉద్యమం లో పాల్గొంటారని అభిజిత్ దీప్కే తెలిపారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో బుధవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. జేపీఎస్‌సీ పరీక్షల్లో అక్రమాలపై విద్యార్థులు కొంతకాలంగా నిరసనలు కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని, వారికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తమ యువజన ఉద్యమం రాజకీయ పార్టీగా కాకుండా ప్రజా సమస్యలపై ఒత్తిడి తీసుకొచ్చే వేదికగా కొనసాగుతోందని, భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యలపై ఉద్య మాలు కొనసాగిస్తామని తెలిపారు. మీడి యా, న్యాయవ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం క్రమంగా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ఇథనాల్ ఇంధనం వంటి కీలక ప్రజా సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన విద్యార్థుల ఆందోళనలకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని దీప్కే తెలిపారు. నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన పోలీసు కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనల్లో గాయపడిన విద్యార్థులకు న్యాయ, వైద్య సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చూక్ మార్గదర్శకత్వంలో తమ భవిష్యత్ కార్యాచరణ కొనసాగుతుందని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు.