calender_icon.png 17 January, 2026 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లమ్మలో పర్శిగా దేవిశ్రీ పరిచయం

17-01-2026 04:20:39 AM

అద్భుతమైన కథలను ఎన్నుకునే స్టార్ నిర్మాత దిల్ రాజు.. ‘బలగం’ ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’ను రూపొందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన వేణు ఓ శక్తిమంతమైన, ఆధ్యాత్మికతతో నిండిన కథను సిద్ధం చేశారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దశాబ్దాలుగా సంగీత దర్శకుడిగా మెప్పించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తున్నారు.

ఈ సినిమా దైవిక శక్తి నేపథ్యంగా, స్థానిక సంప్రదాయాలు, జానపద విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాన్ని బలంగా ప్రతిబింబించేలా రూపొందుతోంది. మకర సంక్రాంతి శుభ సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఈ వీడియోలో దేవిశ్రీప్రసాద్ పాత్ర పేరును ‘పర్శి’గా పరిచయం చేస్తూ ఆయన లుక్‌ను రివిల్ చేశారు. పొడవాటి జుట్టు, రగ్గడ్ లుక్, ఇంటెన్స్ కళ్లతో దేవిశ్రీ లుక్ ఆకట్టుకుంది. ఈ కాన్సెప్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యా యి. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండి యా స్థాయిలో విడుదల కానుంది.