calender_icon.png 17 January, 2026 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘స్పిరిట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

17-01-2026 04:18:42 AM

ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’ మేకర్స్ శుభవార్త తెలియజేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ను ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. 2027, మార్చి 5న ఈ సినిమా విడుదల చేయనున్నట్టు దర్శకుడు సందీప్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే మార్చి 5వ తేదీనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కారణం ఉంది. ఆ నెలలో 6వ తేదీన మహాశివరాత్రి, 7న ఆదివారం వస్తోంది. ఇక 10వ తారీఖున రంజాన్ సెలవు కాగా, 13, 14 మళ్లీ వారాంతం. ఇక ఇదే నెలలో వరుసగా హోలీ, గుడ్‌ఫ్రైడేలూ ఉన్నాయి.

ఇవన్నీ ఈ సినిమాకు కలిసివచ్చే అంశమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పోలీస్ కథతోపాటు మాఫియా నేపథ్యాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట డైరెక్టర్ సందీప్. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ కథానాయిక కాగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన, ప్రకాశ్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం తొమ్మిది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషణ్‌కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.