17-01-2026 04:21:44 AM
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితిరావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూకీ సినిమా ‘గాంధీ టాక్స్’. ఈ చిత్రానికి కిశోర్ పాండురంగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఓ టీజర్‌ను విడుదల చేసిన టీమ్.. తాజాగా మరో టీజర్‌ను పంచుకుంది. విజయ్ సేతుపతి బర్త్‌డేను పురస్కరించుకొని రిలీజ్ చేసిన ఈ రెండో టీజర్ ఆకట్టుకుంటోంది. మాటలు, పాటలు లేకుండా రూపొందే మూకీ సినిమా అనగానే అందరికీ గుర్తుకొచ్చేది కమల్‌హాసన్ ‘పుష్పక విమానం’. అప్పట్లో ఈ మూవీ ఓ సంచలనం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వస్తున్న ఈ మూకీ చిత్రంపై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ నెల 30న ఈ సినిమా విడుదల కానుంది.