31 August, 2026 | 5:14 AM

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

20-05-2024 01:48 AM

దర్శనానికి నాలుగు గంటల సమయం.. ఒక్కరోజే రూ.85.33 లక్షల ఆదాయం

యాదాద్రి భువనగిరి, మే 19 (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కొండకింద పుష్కరిణి, కల్యాణ కట్ట ప్రధాన వీధులతోపాటు కొండపై ఆలయ పరిసరాలు భక్తజన సందోహంగా మారాయి. దీంతో భారీ సంఖ్యలో వాహనాల రాకతో కొండపైన పార్కింగ్ స్థలం సరిపోక వాటిని అనుమతించలేదు. ధర్మదర్శనానికి 4 గంటల సమయం పట్టింది. సాయంత్రం వరకు దాదాపు 50 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా ఆలయ అధికారులు తెలిపారు. రద్దీ కారణంగా సాయంత్రం స్వామివారి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. స్వామివారికి ఒక్కరోజే రూ.85.33 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.