పేదల తిరుపతిపై మైనింగ్ కుట్ర
కురుమూర్తి ఏడుకొండలపై భక్తుల గర్జన
పేదల తిరుపతి కురుమూర్తి స్వామి గుట్టని కాపాడాలి
మైనింగ్ అనుమతులు వెంటనే రద్దు చేయాల్సిందే
చిన్న చింతకుంట, మార్చి 31 : మండల కేంద్ర పరిధిలోని అమ్మాపూర్ గ్రామ శివారులో కాంచన గృహాలో వెలసిన పవిత్ర క్షేత్రమైన శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఏడుకొండల్లో మైనింగ్ తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్థానికు లు, భక్తులు భారీ ఎత్తున కురుమూర్తి స్వామి ఏడుకొండల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కురుమూర్తి స్వామి ఆలయం వద్ద కొండల్లో క్రషర్ క్వారీ ఏర్పాటుకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఏడు కొండలు ఉన్నాయని, క్వారీతో భక్తుల మనసులు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు.
1600 ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం
కాంచన గుహలో వెలసిన శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం దాదాపు 1600 సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. చరిత్ర ప్రకారం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కురుమూర్తి గిరుల్లో వెలిశారని భక్తులు విశ్వసిస్తున్నారు.ఈ క్షేత్రం తెలంగాణలోనే పేదల తిరుపతి గా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నెలరోజుల పాటు జరిగే భారీ జాతరకు తె లంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
తిరుమల తరహాలో ఏడుకొండలు
ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో ఉన్నట్లే కురుమూర్తి స్వామి క్షేత్రంలో కూడా ఏడుకొండలు ఉన్నాయి. తిరుమల కొండల మా దిరిగానే ఇక్కడ కూడా కొండలకు పేర్లు ఉండటం విశేషం.
రూ 110 కోట్ల ఘాట్ రోడ్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
2024లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దాదాపు రూ 110 కోట్లతో వ్యయంతో లిమిటెడ్ క్యారియర్ ఘాట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. భక్తుల రాకపోకలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. పవిత్ర కొండల్లో మైనింగ్ తవ్వ కాలకు ప్రయత్నాలు మళ్ళీ జరుగుతున్నాయన్న సమాచారం భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది.
2023లో అడ్డుకున్న స్థానికులు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మైనింగ్కు ఇచ్చిన అనుమతులను 2023లో స్థానికులు, భక్తులు తీవ్రంగా అడ్డుకున్నారు. అప్పట్లో ప్రజల నిరసనలతో తవ్వకాలు నిలిచిపోయాయి.ఇప్పుడు క్రషర్ మైనింగ్ కాం ట్రాక్టర్ మళ్లీ తవ్వకాలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పవిత్రమైన ఈ కొండలను నాశనం చేసే కుట్ర జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మార్చి 10, 2026న అమ్మాపూరం గ్రామ శివారులో క్వారీ ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు, గ్రామస్తులు బలమైన వ్యతిరేకతను చూపారు.
క్వారీతో పంటపొలాలు, బోరుబావులు నాశనమవుతాయని, బ్లాస్టింగ్తో ఆలయ గోపురాలు, గర్భగుడి దెబ్బతింటాయని వారు హెచ్చరించారు. 2023లో ఇలాంటి ప్రయత్నం ఆగిపోయినా, ఇప్పుడు మళ్లీ అనుమతులకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు కుర్వరమేష్ ఆరోపించారు. ప్రజల ఆందోళనలు రైతులు దుమ్ముధూళి, భూప్రకంపనలతో పంటలు పడిపోతాయని, భవిష్యత్ తరాలకు ఇబ్బందులవుతాయని చెప్పారు.
పర్యావరణ సంస్థలు వన్యప్రాణులకు హాని జరుగుతుందని, హిందూ భక్తులు మనోభావాలు గాయపడతాయని వాదించారు. అధికారులపై సమాచారం దాచారని, ప్రజాభిప్రాయ సేకరణ హడావుడిగా జరిగిందని విమర్శలు వచ్చాయి.ప్రభుత్వ చర్యలుఅదనపు కలెక్టర్ హరిప్రియా అభిప్రాయాలను సేకరించి కేంద్రానికి పంపుతామని తెలిపారు. గ్రామస్తులు అనుమతులు ఇస్తే ఉద్యమాలు, ప్రాణత్యాగాలకు వెనుకాడవని హెచ్చరించారు. ఇప్పటివరకు భారీ నిరసనలు రోడ్ల మీద టెంట్లు వేసి, పాదయాత్రలతో కొనసాగుతున్నాయి.




