13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్థిక భరోసా

01-04-2026 12:00 AM

ములుగు (మహబూబాబాద్) మార్చి 31 (విజయక్రాంతి): మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిందని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళల జీవితాల్లో వెలుగు నింపుతుందన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం ,ఉత్సవాలు 2026’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పథకాలతో ప్రతి కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 1.90 కోట్ల ప్రయాణాల ద్వారా మహిళలు 133.25 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారని స్పష్టం చేశారు. 

సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం పథకాలను రూపొందిస్తుందని, వాటిని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.ఈ పథకం ద్వారా కూలీ పనులు చేసుకునే వారు, మధ్యతరగతి మహిళలు, ఉద్యోగినులు ఎంతో లబ్ధి పొందుతున్నారని కలెక్టర్ అన్నారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తూ త్వరలోనే సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

18 ఏళ్లు నిండిన ప్రతి మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మున్సిపల్ చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, అదనపు కలెక్టర్ సంపత్ రావు, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, ఆర్టీసీ డి.ఎం. రవిచందర్, అడిషనల్ డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.