24 June, 2026 | 9:55 PM

ముంబై గెలుపు బాట పట్టేనా?

20-04-2026 12:50 AM

గుజరాత్‌తో కీలక పోరు

సూపర్ ఫామ్‌లో గిల్, బట్లర్

అహ్మదాబాద్, ఏప్రిల్ 19: ఐపీఎల్ 19వ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్ సిద్ధమైంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది. ముంబై ఈ సారి కూడా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. ఆరంభ మ్యాచ్‌లో గెలిచిన ఆ జట్టు తర్వాత వరు సగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది. ప్రస్తుతం పా యింట్ల పట్టికలో కేవలం 2 పాయింట్లతో అట్టడుగు స్థా నంలో నిలిచింది.

IPL 2026 అన్ని జట్ల తాజా పరిస్థితి, మ్యాచ్ రిజల్ట్స్ కోసం మా క్రికెట్ న్యూస్ పేజీ చూడండి.

ప్లే ఆఫ్ అవకాశాలు నిలవాలంటే ఇక్క డ నుంచి జరిగే మ్యాచ్‌లలో విజయాలు సాధించాల్సిందే. రోహిత్ శర్మ గాయంతో దూరమవడం ముంబైకి ఎదురుదెబ్బగా చెప్పాలి. గత మ్యాచ్‌లో డికాక్ సెంచరీ చేసినా బౌలర్ల వైఫల్యంతో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, రికల్టన్ పేలవ ఫామ్ లో ఉన్నారు. తిలక్ వర్మ సైతం నిరాశపరుస్తున్నాడు. హార్థిక్ పాండ్యా, రూథర్ ఫర్డ్ మ్యాచ్‌లను ఫినిష్ చేయలేకపోతున్నారు. బ్యాట ర్లు సమిష్టిగా రాణిస్తేనే ముంబై గెలుపు బాట పట్టే అవకాశముంటుంది.

IPL 2026 తాజా వార్తలు, స్కోర్‌కార్డులు అన్నీ ఒకే చోట చదవాలంటే మా హోంపేజ్ విజిట్ చేయండి.

అటు బౌలింగ్ లోనూ ముంబైకి ఏదీ కలిసి రావడం లేదు. స్టార్ పేసర్ బుమ్రా వికెట్లు తీయలేకపోతుండడం ఆ జట్టుకు మైనస్ పాయింట్. ఒకప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన బుమ్రా ఇప్పుడు ఐదు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో ముంబై త్వరగా ఫామ్ అందుకోవాలని ముంబై ఎదురుచూస్తోంది. మిగిలిన బౌ లర్లలో శార్థూల్ ఠాకూర్, హార్థిక్ పాండ్య, శాంట్నర్ కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది.

మొదట వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన గుజ రాత్ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఢిల్లీ, లక్నో, కోల్‌కతా జట్లపై గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.  శుభమన్ గిల్, సాయి సుదర్శన్‌తో పాటు బట్లర్ ఫామ్‌లో ఉండగా... వాషింగ్టన్ సుందర్ కూ డా మెరుపులు మెరిపిస్తున్నాడు. అటు బౌలింగ్‌లో రబాడ, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ సత్తా చాటుతున్నారు. స్పి న్నర్ రషీద్ ఖాన్ కూడా కీలకంగా ఉన్నాడు. గత రికార్డుల్లో ముంబైపై గుజరాత్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 8 సార్లు తలపడితే గుజరాత్ ఐదింటిలో గెలిచింది. మూడు మ్యాచ్ లలో ముంబై విజయం సాధించింది. 


FAQ's:


1. MI vs GT మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

IPL 2026లో ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఏప్రిల్ 19న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.


2. ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఎలా ఆడుతోంది?

ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో పేలవ ఫామ్‌లో ఉంది. మొదటి మ్యాచ్ గెలిచినా తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది.


3. గుజరాత్ టైటాన్స్ ఫామ్ ఎలా ఉంది?

గుజరాత్ టైటాన్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి మంచి ఫామ్‌లో ఉంది.


4. MI vs GTలో కీలక ప్లేయర్లు ఎవరు?

ముంబై నుండి హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్; గుజరాత్ నుండి శుభమన్ గిల్, జోస్ బట్లర్ కీలకం.


5. ఈ మ్యాచ్‌లో ఎవరికీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి?

ప్రస్తుత ఫామ్‌ను బట్టి గుజరాత్ టైటాన్స్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


6. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఏమిటి?

ఇప్పటి నుంచి వరుసగా గెలిస్తేనే ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు నిలుస్తాయి.


7. MI vs GT మ్యాచ్ ఎక్కడ చూడాలి?

ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ మరియు JioCinemaలో లైవ్ చూడవచ్చు.


8. గిల్, బట్లర్ ఫామ్ ఎలా ఉంది?

గిల్, బట్లర్ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండి గుజరాత్‌కు బలం అవుతున్నారు.


ఇవి కూడా చదవండి:

20 నుంచి టీసీఏ ఆల్‌స్టార్ టీ20 సూపర్ లీగ్

ఐపీఎల్ నుంచి ఖలీల్ అహ్మద్ ఔట్

RCB vs LSG: విరాట్ కోహ్లీ దుమ్మురేపగా బెంగళూరు ఘన విజయం

MI vs PBKS 2026: రోహిత్ ఆడతాడా? ముంబై ఒత్తిడిలో నేడు కీలక పోరు

KKR కష్టాలు మరింత పెరిగాయి: రహానేపై రూ.12 లక్షల జరిమానా, పాయింట్ల పట్టికలో అట్టడుగున

చివరి ఓవర్లో గెలిచిన కేకేఆర్… హీరోగా రింకూ!

ముంబై గెలుపు బాట పట్టేనా?

తప్పుడు ఆరోపణలను ఖండించిన హెచ్‌సీఏ

డికాక్ సెంచరీ వృథా… పంజాబ్ దంచికొట్టింది!

పంజాబ్ ధనాధన్

సెమీఫైనల్లో పంజాబ్, విదర్భ

పంజాబ్‌కు ఎదురుందా?