24 August, 2026 | 11:27 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

విదేశీ పర్యటకలు ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించండి

08-12-2024 11:41 PM

కలెక్టర్ జితేష్ వి పాటిల్...

భద్రాచలం (విజయక్రాంతి): శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి దేశ, విదేశాల నుండి భక్తులతో పాటు టూరిస్టులు అధికంగా వస్తుంటారని, వారికి గిరిజన ఆచార వ్యవహారాలు సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ట్రైబల్ మ్యూజియం, ఆదివాసి వంటకాల నిర్వహణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం నాడు భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను ఆయన సందర్శించి మ్యూజియంలో నిర్మాణం చేపడుతున్న గడ్డి ఇండ్లను, టూరిస్టులకు ఆదివాసి వంటకాలు, కోయ కల్చర్కు సంబంధించిన వస్తువులు అందించే స్టాల్స్ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యూజియం సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఆకర్షించే విధంగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ట్రైబల్ కల్చర్ ఉట్టిపడేలా అన్ని హంగులతో తయారు చేయాలని అన్నారు. అదేవిధంగా విదేశీ పర్యటకులు రాత్రిపూట బస చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ రాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.