అమ్మవారి సన్నిధిలో భక్తి పారవశ్యం.. బోనాల వైభవం
అమ్మవారికి ప్రత్యేక బోనం, ఒడిబియ్యం, పట్టు వస్త్రాల సమర్పణ
అలంపూర్, జూలై 19: ప్రముఖ ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఆదివారం బోనాల మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మురాద్ మహల్, గౌలిపుర శ్రీ మహంకాళి నల్లపోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించగా, పోతురాజు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గొర్రెలు,
మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సతీమతి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక బోనం, ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.బోనాల సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోగా, జై మహంకాళి.. జై జోగులాంబ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.






