11 August, 2026 | 1:54 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి

16-06-2025 07:16 PM

సమగ్ర శిక్షా ఉద్యోగుల రాస్తారోకో..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తొర్రూరు మండలానికి చెందిన సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగి సర్వి రమేశ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించగా, బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సర్వ శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం తొర్రూరు పట్టణంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన రమేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర బాధ్యులు షేక్ ఖాదర్, మారగాని జానకిరామ్, పడాల సహదేవ్, కంచర్ల మహేందర్, వెల్తూరి మల్లేశం, బానోత్ బిక్షపతి, మహంకాళి వీరన్న, నదీం, రాజశ్రీ, కల్పన, ఉదయ్, రంగయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.