calender_icon.png 24 December, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నట్టల నివారణ టీకా తప్పనిసరి వేయించండి

24-12-2025 04:18:22 PM

రైతులకు సర్పంచ్ గీతా రాణి సూచన

నవాబ్ పేట్: గాలి కుంటు వ్యాధి నుంచి రక్షించుకునేందుకు పశువులకు, గొర్రెలు,మేకలకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించాలని నవాబ్ పేట గ్రామ సర్పంచ్ గీతారాణి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన  నట్టల నివారణ టీకాలు అందించే కార్యక్రమాన్ని సర్పంచి ప్రారంభించి మాట్లాడారు.

రైతులకు వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. పశువులకు అవసరాన్ని మందులు అందుబాటులో ఉంచి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని ఆరోగ్యంగా ఉంటేనే పశువులు కాపలదారులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎండి అజార్ అలీ, వార్డు సభ్యులు, జేకే ట్రస్ట్ చైర్మన్ నర్సింహ చారి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.