calender_icon.png 24 December, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీయూలో హైటెక్ కాపీయింగ్

24-12-2025 04:08:25 PM

పట్టించిన బీప్ సౌండ్

హైదరాబాద్: గచ్చిబౌలిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) ఉపయోగించి పరీక్షల్లో కాపీయింగ్ జరిగింది. హరియాణాకు చెందిన అనిల్, సతీష్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. హెచ్సీయూ(Hyderabad Central University) నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం నియామక పరీక్ష చేపట్టింది. పరీక్షకు వచ్చిన యువకులు షర్టు బటన్లకు అమర్చిన మైక్రో స్కానర్లతో ప్రశ్నాపత్రం స్కాన్ చేశారు. అనంతరం బాత్ రూమ్ కు వెళ్లిన నిందితులు ఏఐ సాయంతో జవాబులు సేకరించారు. చెవిలోని బ్లూటూత్ ద్వారా జవాబులు వింటూ పరీక్ష రాశారు. పరీక్ష రాస్తుండగా బ్లూటూత్ బీప్ శబ్దంతో(Bluetooth beep sound) ఇన్విజిలేటర్ కు అనుమానం వచ్చింది. వర్సిటీ అధికారులకు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి స్కానర్లు, బ్లూటూత్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.