calender_icon.png 24 December, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎస్‌హెచ్‌ఎంల నూతన కార్యవర్గం ఏర్పాటు

24-12-2025 04:25:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి సంఘ సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు గౌరవ అధ్యక్షులుగా దస్తురాబాద్ కు చెందిన కోట వేణు జిల్లా అధ్యక్షులుగా ఖానాపూర్ కు చెందిన కే ప్రవీణ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా ముధోల్ చెందిన ఎస్ దేవేందర్ రెడ్డి ఉపాధ్యక్షులుగా లక్ష్మణ కు చెందిన ఎం భూమన్న మహిళా ఉపాధ్యక్షులుగా సోనుకు చెందిన పి.త్రివేణి కార్యదర్శులుగా సారంగపూర్ కు చెందిన జి భూమేష్ మహిళా కార్యదర్శిగా నిర్మల్ రూలర్ కు చెందిన బి జలజ కోశాధికారిగా పెంబికి చెందిన జై లింగన్న మీడియా ఇన్చార్జిగా సోను కు చెందిన రమేష్ బాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యవర్గం రెండేళ్ల పాటు పనిచేస్తుందని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలిపారు కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంల ఆధ్వర్యంలో సన్మానం అభినందనలు తెలిపారు