calender_icon.png 24 December, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత ఆటస్థలం కోసం సర్పంచ్ కోడాల వెంకటరెడ్డి ఆదర్శం

24-12-2025 04:28:55 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండలం రాజపేట తండా గ్రామపంచాయతీ సర్పంచ్ కోడాల వెంకటరెడ్డి యువత కోసం ఆదర్శంగా నిలిచాడు. గ్రామ పంచాయతీలో ఉన్న సర్వే నెంబర్ 278లో యంత్రం సహాయంతో బుధవారం ఆటస్థలం మరమ్మతులు పనులు చేపట్టారు.

సర్పంచ్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... నూతన గ్రామపంచాయతీని వినూత్నంగా అభివృద్ధి చేయడమే నా ధ్యేయంమని అన్నారు. గ్రామములో గ్రామపంచాయతీ కార్యాలయము, స్మశాన వాటికను గ్రామస్తుల పెద్దల సహకారంతో, తక్షణమే నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.గ్రామపంచాయతీని నా లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజపేట తండా గ్రామపంచాయతీ యువత పాల్గొన్నారు.