calender_icon.png 24 December, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాంకిడి సర్పంచ్‌గా సతీష్ ప్రమాణ స్వీకారం

24-12-2025 04:21:31 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా సిహెచ్. సతీష్ బుధవారం రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారి శ్రావణ్ కుమార్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సిహెచ్ సతీష్ తో పాటు ఏడుగురు వార్డు సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామంలోని ఆయా సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అలాగే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామపంచాయతీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో పాటుపడతా అన్నారు.