24-12-2025 04:33:59 PM
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) బుధవారం మాట్లాడుతూ, థాకరే సోదరులు కేవలం అధికారం కోసమే ఏకమయ్యారని, ముంబై అభివృద్ధికి వారి వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని ఆరోపించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) ఎన్నికలు జనవరి 15న జరగనున్న నేపథ్యంలో, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఈ రోజు ఉదయం తమ పార్టీల పొత్తును ప్రకటించారు.