ధర్మపురి క్షేత్రం అభివృద్ధితో మారనున్న రూపురేఖలు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, ఆగస్టు 13 (విజయ క్రాంతి): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ధర్మపు రి క్షేత్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నా మని, ధర్మపురి క్షేత్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ధర్మపురి రూపురేఖలు మారనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మార్ తెలిపారు. గురువారం ధర్మపురి 15వ వార్డు అంబేద్కర్ భవన నిర్మాణ పనులను మంత్రి అడ్లూరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భం గా ధర్మపురి పట్టణంలోని వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ధర్మపురిలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అంబేద్కర్ భవన నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.
గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం 117 కోట్లు కేటాయించగా ఇందులో ధర్మపురిలో 37 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వివరించారు. వీటితోపాటు టి యు ఎఫ్ ఐ డి సి నిధులు రూ. 15 కోట్లతో పాటు అమృత పథకం ద్వారా నిధులు సాధించి ధర్మపురి లో అభివృద్ధి పనులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. మంత్రి వెంట ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్ తోపాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.






