09-11-2025 12:00:00 AM
బెంగళూరు, నవంబర్ 8 : సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ సెంచరీలతో దు మ్మురేపుతున్నాడు. సౌతాఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో రెండు సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన జురెల్ తాజాగా రెండో ఇన్నింగ్స్‌లో నూ శతక్కొట్టాడు. జురెల్ 159 బంతుల్లో 11 ఫోర్లతో శతకం సాధించాడు.
హర్ష్ దూబేతోనూ, తర్వాత కెప్టెన్ పంత్‌తోనూ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు భారీస్కోరు అందించాడు. జురెల్ 127 (15 ఫోర్లు, 1 సిక్సర్) రన్స్‌తో నాటౌట్‌గా నిలవగా.. భారత్ ఏ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 382/7 స్కోర్ దగ్గర డిక్లేర్ చేసింది. దీంతో 416 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతా ఫ్రికా ఏ జట్టు మూడోరోజు ఆటముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 25 రన్స్ చేసింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టును గెలిచిన భారత్ ఏ బౌలర్లు చివరి రోజు చెలరేగితే సిరీస్‌ను స్వీప్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.