24 August, 2026 | 1:20 AM

తమిళిసైని అమిత్ షా మందలించారా?

13-06-2024 01:07 AM
  • చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై అనూహ్యమైన దృశ్యం

నెట్టింట వైరలైన వీడియో

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార చేస్తున్న సభావేదికపై అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై వేదికపైకి వచ్చి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయడితో మాట్లాడుతుండగా కేంద్ర మంత్రి అమిత్ షా ఆమెను చూశారు. వెంటనే ఆమెను పిలిచి మందలించినట్లుగా వేలు చూపిస్తూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోపై నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటునైనా దక్కించు కోలేదు. ఫలితాల తర్వాత అక్కడి బీజేపీ శ్రేణుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై తమిళిసై బహిరంగ విమర్శలు సైతం చేశారు. ఈ అంశపైనే తమిళిసైకి అమిత్ షాకి మధ్య సంభాషణ జరిగిందేమోనని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.