24 August, 2026 | 11:35 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

లాడెన్‌ను అప్పుడే మరిచిపోయారా?

20-06-2025 12:31 AM

మునీర్‌కు ట్రంప్ విందుపై శశిథరూర్ స్పందన

న్యూఢిల్లీ, జూన్ 19 (విజయక్రాంతి): పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్‌కు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో విందు ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ స్పందించారు. మోస్ట్‌వాంటెడ్ ఒసామా బిన్ లాడెన్‌కు పాక్ ఆశ్రయం కల్పించిన విషయాన్ని మరిచిపోకూడదంటూ చురకలంటించారు. ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడిలో ప్రధాన సూత్రధారి ఒసా మా బిన్ లాడెన్ ఎపిసోడ్‌ణు పాక్ బృందాన్ని కలిసిన కొంతమంది చట్టసభ సభ్యులు మరిచిపోయినప్పటికీ అమెరికా ప్రజలు మాత్రం అంత తొందరగా మరిచిపోలేరు.

ఇటువంటి వ్యక్తి దొరికేవరకు.. ఓ ఆర్మీ క్యాంపు దగ్గర పాక్ దాచిపెట్టిన విషయాన్ని అమెరికన్లు అంత తొందరగా మరిచిపోరు. మరి అలాంటి చరిత్ర కలిగిన పాక్ ఆర్మీ చీఫ్‌తో.. అమెరికా అధ్యక్షుడు భేటీ అవ్వడం చూస్తుంటే.. నాకు చాలా విస్మయంగా ఉంది’ అని శశిథరూర్ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు శిక్షణాపరంగా, ఆర్థికంగా మద్దతు ఇవ్వకూడదనే విషయాన్ని పాకిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడు ఈ సందర్భంగా హెచ్చరించి ఉంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో కొందరితో తనకు భిన్నాభిప్రా యాలు ఉన్నమాట వాస్తవమేనని శశిథరూర్ అంగీకరించారు. అయితే, వాటిని పార్టీ అంతర్గత సమావేశంలోనే చర్చిస్తానని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై ఏర్పాటైన ఓ అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించిన శశిథరూర్.. ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో పర్యటన గురించి తప్ప, వేరే విషయాలేవీ చర్చించలేదని స్పష్టం చేశారు.