24 August, 2026 | 10:29 PM

Breaking News

అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •  

జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు నిజమే

20-06-2025 12:34 AM

నిర్ధారించిన ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్

న్యూఢిల్లీ, జూన్ 19: సంచలనం సృష్టించిన ఢల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు కాలిపోయిన మాట వాస్తవమే అని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ నిర్ధారించింది. ఈ అంశానికి సంబంధించి 60 పూజీల నివేదికను సమర్పించింది.

డబ్బులు ఉన్న స్టోర్ రూమ్ జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబీకుల ఆధీనంలో ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. డబ్బులు కాలిపోయాయనే దానికి బలమైన ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. ఇంత పెద్ద ఎత్తున డబ్బును జస్టిస్ వర్మ ఆయన కుటుంబసభ్యులు స్టోర్ రూమ్‌లో ఉంచడంపై ప్యానల్ అనుమానాలు వ్యక్తం చేసింది.

ఈ దర్యాప్తులో భాగంగా విచారించిన సాక్షులు తమ జీవితంలో అంత డబ్బు చూడలేదని అభిప్రాయపడ్డారు. జస్టిస్ వర్మ కుమార్తె దియా, వర్మ ప్రైవేట్ కార్యదర్శి రాజేందర్ సింగ్‌ను కూడా ప్యానల్ విచారించింది. మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరగ్గా.. పెద్ద ఎత్తున కాలిన నోట్లు బయటపడ్డాయి.