17-07-2025 12:54:17 AM
బెజ్జూర్, జూలై ౧౬ (విజయక్రాంతి): మం డల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని బుధవారం డీఐఈవో కళ్యాణి ఆక స్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు ఉపాధ్యాయుల హాజరు పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ పకారం భోజనం అందించాలని ప్రత్యేక అధికారి అరుణకు సూచించారు.
ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల ఆరో గ్యం పట్ల, విద్యార్థుల విద్య బోధన విషయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున విద్యార్థుల ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.