కాంగ్రెస్ పాలనలో బ్రాహ్మణులకు కష్టాలు
- విదేశీ విద్యానిధికి రూ.30 కోట్లు ఇవ్వాలని
- ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి
- బీఆర్‌ఎస్ ప్రభుత్వం బాగా చూసుకుంది: ఎమ్మెల్సీ సురభి వాణీదేవి
- విద్యానిధిపై క్యాబినెట్‌లో చర్చించాలి: దేవీప్రసాద్
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల పరిస్థితి దయనీయంగా మారిందని ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది అర్చక కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయని, వారి పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. గురువా రం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి, దేవీప్రసాద్‌తో కలిసి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాలనలో పేద బ్రాహ్మణులను అనేక విధాలుగా ఆదుకున్నారని ప్రశంసించారు. 2017లో బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేశారని తెలిపారు.
ఆలయాల్లో అర్చకులకు కేసీఆర్ గౌరవ వేతనంగా ఇచ్చారని గుర్తుచేశారు. ధూపదీప నైవేద్య పథకంలో భాగంగా ప్రతి ఆలయానికి నిధులిచ్చారని చెప్పారు. వృద్ధులైన వేద పండితులకు ఆర్థికసా యం, బ్రాహ్మణ విద్యార్థులు విదేశా ల్లో చదువుకోవడానికి ఫెలోషిప్ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదలైన తర్వాత బ్రాహ్మణులకు కష్టా లు మొదలైయ్యాయని ఆరోపించారు. విదేశీ విద్యానిధి కింద చదువుకుంటున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యానిధికి రూ.30 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ ఎంటర్‌ప్రిన్యూర్స్‌కు రూ.15 కోట్లు ఇవ్వా ల్సి ఉందని, బ్రాహ్మణ పరిషత్ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు.
వెంటనే వారికి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగే మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రసంగిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్లిన విద్యార్థులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గత నెల రోజుల నుంచి తనకు మా బంధువుల పిల్లల ఫోన్ చేస్తున్నారని పేర్కొన్నారు. బ్రాహ్మణులు అగ్రవర్ణాలైన చాలామంది పేదలు ఉన్నారని, పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణులను ఆదుకోవడంలో నేటి పాలకులు విఫలమైయ్యా రని మండిపడ్డారు. రూ.30 కోట్లు చెల్లిం చే విషయంపై మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని సూచిం చారు. ఉద్యోగుల వేతనాలు కూడా త్వరగా చెల్లించాలి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.






