27-12-2025 09:34:13 PM
పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి
కల్వకుర్తి: ఎర్రవల్లి ప్రజల ఘోష పాలకుల తీర్చాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. డిఎల్ఐ ప్రాజెక్ట్ లో భాగంగా ముంపు గురవుతున్న చారగొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను కాపాడాలని కల్వకుర్తిలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని, నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల జలదోపిడి కంటశోకంగా మారిందని విమర్శించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి నల్గొండ జిల్లా జల దోపిడీని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను ముంపు బారి నుండి కాపాడుకోవాలని మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, బిజెపి నాయకులు తల్లోజు ఆచారి సమావేశంలో పాల్గొని పిలుపునిచ్చారు. కొందరు స్వార్థం కోసం ఈ ప్రాజెక్టును చేపట్టి కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్ గౌడ్, దుర్గాప్రసాద్, పరుశరాములు, జంగయ్య, రాఘవేంద్ర గౌడ్, ఏపీ మల్లయ్య, బాలయ్య, వెంకటయ్య, శ్రీనివాస్, ప్రకాష్, నాగయ్య, సదానందం తదితరులు పాల్గొన్నారు.