27-12-2025 09:42:10 PM
మాగనూరు: గత వారం రోజుల క్రితం బూడిద టిప్పర్ ఢీకొని తీవ్ర గాయాపడిన మాజీ ఆర్మీ జవాన్ సంజీవ్ హైదరాబాదులో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సొంత గ్రామమైన మాగనూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్ మక్తల్ లో పనులు ముగించుకొని బైకుపై తిరుగు ప్రయాణం సమయములో మక్తల్ మండలం 167వ జాతీయ రహదారి తిర్లాపూరు గ్రామ స్టేజ్ వద్ద ఎదురుగా వస్తున్న ఓ బూడిద టిప్పర్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే సంజీవును మక్తల్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇంకా మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించుచుండగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, మండలం ,గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.