calender_icon.png 27 December, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్వాపురం రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి

27-12-2025 09:05:44 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో డివైడర్ పనులు పూర్తయినా, ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఉపసర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

నాలుగు నెలలుగా రోడ్డును తవ్వేసి వదిలేయడంతో లేస్తున్న దుమ్ము కారణంగా ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని, యుద్ధప్రాతిపదికన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు.