16 May, 2026 | 2:07 PM

డిండి లిఫ్ట్‌ను రద్దు చేయాలి

16-05-2026 01:25 PM

ఉమ్మడి జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం కల్గుతుంది 

ప్రభుత్వానికి లేఖ రాసిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే లు జి మధుసూదన్ రెడ్డి, జనంపల్లి అనిరుద్ రెడ్డి, వంశీకృష్ణ, జేఏసీ నేతలు 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : డిండి లెఫ్ట్ ను రద్దు చేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే లు అనిరుద్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, వంశీకృష్ణ, కమిటీ నేతలు ప్రభుత్వానికి లేఖ అందించారు. ఉమ్మడి జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే డిండి లిఫ్ట్‌ను రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.

ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ గొట్టిముక్కుల లిఫ్ట్ స్కీమ్ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. 8-8-2013న విడుదల చేసిన జీవో 72ను వెంటనే అమలు చేయాలని కోరింది.జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన అన్ని సాగునీటి పథకాలను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. రైతుల సాగునీటి సమస్యను సత్వరం పరిష్కరించాలని లేఖలో స్పష్టం చేసింది. పాలమూరు రైతాంగ ప్రయోజనాల కోసం జేఏసీ నిరంతరం పోరాటం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జేఏసీ నాయకులు బెక్కం జనార్ధన్, రాజేందర్ రెడ్డి, చిన్న కిష్టప్ప, తదితరులు పాల్గొన్నారు.