26 July, 2026 | 8:39 AM

సీఎంతో సమానంగా దీపాదాస్

31-05-2024 12:59 AM

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి పనికి ఢిల్లీ అధిష్ఠానం వైపే చూస్తుంది అన్ని విమర్శలను ఆ పార్టీ నిజం చేస్తున్నది. గురువారం సచివాలయంలో రాష్ట్ర గేయం ‘జయ జయహే తెలంగాణ’పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీకి మండలి చైర్మన్ పక్కనే సీటు కేటాయించారు. మంత్రులంతా ఆమె వెనుక కూర్చోవటం గమనార్హం. దీపాదాస్ మున్షీని ఈ సమావేశానికి ఏ హోదాలో పిలిచారని పలువురు ప్రశ్నిస్తున్నారు.