calender_icon.png 19 August, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగులాంబ సన్నిధిలో డైరెక్టర్ హరీష్ శంకర్, యాంకర్ సుమ

12-08-2024 09:04:44 PM

జోగులాంబ గద్వాల్: అలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల ఆలయాలను ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్, యాంకర్ సుమ సోమవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ పురేందర్ అర్చకులు పాల్గొన్నారు.