calender_icon.png 19 August, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజులు భారీ వర్షాలు

12-08-2024 08:55:49 PM

ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం, బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సోమవారం వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమిటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తరు వానలు పడుతాయని చెప్పింది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 24డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.