04-08-2025 12:41:04 AM
కామారెడ్డి, ఆగస్టు 03 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 5 న నిర్వహించే ధర్నా కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ రానున్నట్లు వికలాంగుల హక్కుల పోరాట సమతి జిల్లా అధ్యక్షుడు కోలా బాలారాజ్ గౌడ్ ఆదివారం కామారెడ్డిలో తెలిపారు.
వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు చేనేత కార్మికులు అందరూ హాజరుకావాలన్నారు.ఈ కార్యక్రమం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. 4000 పెన్షన్, 6000 పెన్షన్ కోసం రెండు వేల పెన్షన్ కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటానికి వికలాంగ సోదరులు, వృద్ధులు, వితంతువులు, హాజరు కావాలన్నారు.