04-08-2025 12:41:11 AM
కల్వకుర్తి, ఆగస్ట్ 3:పశువుల సంత అంటే రైతుకు ఊరట కలిగించే వేదిక కావాలి. కానీ కల్వకుర్తిలో నిర్వహించబడుతున్న పశువుల సంత వసూళ్ల పర్వానికి వేదిక అవుతుంది. ఎండల వేడిమిక నిలువ నీడ లేక, తాగునీరు లేక ఆటో మూగజీవాలు ఇటు రైతులు దా హంతో అలమటిస్తున్నారు. అయినా వసతు లు కల్పిస్తున్నట్లు వసూళ్లు మాత్రం దండిగా జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
ప్రతి వారం నిర్వహించే పశువుల సం తకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వే ల సంఖ్యలో వ్యాపారులు, రైతులు హాజరవుతున్నారు. పశువులను తీసుకురావడం, తీసు కెళ్లడం కోసం అనేక రకాల వాహనాలు వస్తుండగా, వాటిపై పార్కింగ్ ఫీజుల వసూలు విషయంలో పారదర్శకత లేకపోవడం స్థానికుల్లో ఆగ్రహానికి కారణమవు తోంది.సాధారణంగా మునిసిపాలిటీ శాఖ నిబంధనల ప్రకారం వాహన రకానికి అనుగుణంగా ఫీజులు వసూలు చేయాల్సి ఉంది.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత సిబ్బంది, ప్రైవేట్ మద్దతుదారులు అధికంగా వసూలు చేస్తున్నట్లు పలువురు రైతులు ఆవేదన వ్య క్తం చేశారు. పశువులకు తాగడానికి ఏర్పాటు చేసిన నీటి కొలను ప్లాస్టిక్ వ్యర్థాలు, నా చుతో నిండి కనిపిస్తోంది. కానీ అధికారులు మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇలా అయితే పశుసంత ఎందుకు అంటూ రైతులు మండి పడుతున్నారు.
అమ్మిన వారినుండి 100 కొన్నవారునుండి 650 వసూ లు చేసి సొమ్ము చేసుకుంటున్నారు కానీ వ సతులు కల్పించడంలో శ్రద్ద చూపాదం లేద ని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ము న్సిపల్ సిబ్బంది పార్కింగ్ రశీదు లేకుండానే రూ.50 నుండి రూ.100 వసూలు చేస్తున్నారనివాపోతున్నారు.