calender_icon.png 4 August, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రమశిక్షణకు నిదర్శనం ఐజేయూ

04-08-2025 12:39:51 AM

  1. యూనియన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి 

కొత్తకోటలో మొదటి జిల్లా కార్యవర్గ సమావేశం 

హాజరైన రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ 

కొత్తకోట ఆగస్టు 03 : క్రమశిక్షణ కు నిదర్శనం టీయూడబ్ల్యూజే ఐజేయు అని, యూ నియన్ నియమా నిబందనలు జిల్లా కార్యవర్గ సభ్యులు తప్పనిసరిగా పాటించి యూని యన్ గౌరవాన్ని కాపాడాలని రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అన్నారు. ఆదివారం కొత్త కోటలోని శ్రీ కృష్ణ ఆలయంలో ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యతి తులుగా రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్, హౌ సెట్ రాష్ట్ర సభ్యులు శ్రీనివాసరావు, జిల్లా అ ధ్యక్ష కార్యదర్శులు మాధవరావు, రాజులు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ రాష్టంలో అత్యంత సభ్య త్వాలు కలిగిన సంఘం టియుడబ్ల్యూజే ఐజే యు అని అన్నారు. యూనియన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చే శారు.

ప్రతి జర్నలిస్టుకు కావాల్సింది ఇల్లు, ఆరోగ్యం, విద్య అని వీటి విషయంలో మన యూనియన్ అండగా నిలుస్తుందని చెప్పా రు. హెల్త్ విషయంలో ఎం అవసరం వచ్చిన మన యూనియన్ తరపున మీకు సాయం చేయడానికి ముందుంటామని చెప్పారు. ప్రతి మండలంలో జర్నలిస్టుల పిల్లలకు కా ర్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు.

అలాగే ఇండ్ల విషయంలో వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారని మరోసారి ఎమ్మెల్యేల సహకారంతో ప్రతి జర్నలి స్టుకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత మన యూనియన్ తీసుకుంటుందని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ కోసం 10 గుంటల భూమిని టియుడబ్ల్యూ జే ఐజేయు సాధించిన విషయాన్నీ గుర్తు చేశారు.

అ స్థలంలో కోటి రూపాయలతో అ త్యంత ఆధునికంగా ప్రెస్ క్లబ్ భవనాన్ని ని ర్మించి తిరుతామని అన్నారు. యూనియన్ నిబంధనలకు కట్టుబడి పని చేసే ప్రతి జర్నలిస్ట్ కు పదవులు వస్తాయని చెప్పారు. అనం తరం జిల్లా హెల్త్ కన్వీనర్ గా పెద్దమందడి బుద్వేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ద్వారాపోగు మన్యం, ఉపాధ్యక్షులు నాకొండ, ప్రవీ ణ్, నియోజకవర్గ అధ్యక్షులు విజయ్, కార్యవర్గ సభ్యులు ధనుష్, రవి, అమీర్, రమేష్, జర్నలిస్టులు ఖాజామైనొద్దీన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.