calender_icon.png 13 November, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసమ్మతి జోరు.. ఆధిపత్య పోరు..!

13-11-2025 12:00:00 AM

- భద్రాద్రిలో బీఆర్‌ఎస్‌లో పదవుల రగడ

- జిల్లా అధ్యక్షునిపై మాజీ ఎమ్మెల్యేల గరం గరం 

- భగ్గుమంటున్న అంతర్గత కలహాలు

- రేగాతో, మాజీ ఎమ్మెల్యేల ఢీ,అంటే ఢీ..

- ఇంటి పోరుతో జిల్లా గులాబీ బాస్ రేగా సతమతం 

- విభేదాల గులాబీ.. సందిగ్ధంలో పార్టీ శ్రేణులు.. 

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 12, (విజయక్రాంతి); భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గులాబి పార్టీలో మండల అధ్యక్షుల నియామకం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్న ది. దీంతో జిల్లా అధ్యక్షుని పై అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతు న్నాయి. మంగళవా రం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రకటించిన పార్టీ సంస్థాగత పదవుల ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో ఇన్నాళ్లు పార్టీలో నివురు కప్పిన నిప్పులా ఉన్న నేతల మధ్య అంతర్గత కలహాలు ఒక్కసారిగా భగ్గు మంటున్నాయి.

విభేదాలతో గులాబి పార్టీ గ్రూప్ రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే.. అన్నట్లుగా గులాబి బలగం పయనం కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా, మా జీ ఎమ్మెల్యేలు వనమా, హరిప్రియనాయక్ మధ్య తాజాగా పదవుల పంపకం పలు వివాదాలకు కారణమవుతున్నది.ఈ అసంతృప్త జ్వాలలతో కార్యకర్తలలో సందిగ్గం నెలకొంది. కారు పార్టీలో నెలకొన్న అంతర్గత పోరుపై విజయక్రాంతి ప్రత్యేక కథనం ..

పదవుల రగడ..

కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గలలో చుంచుపల్లి 1,2 తో పాటు జూలూరుపాడు, ఇల్లెందు నూతన మండల, పట్టణ అధ్యక్ష పదవి నియామకంపై జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు చేసిన ప్రకటనతో గులాబీ పార్టీలో తీవ్ర రగడ మొదలైంది. ఆయన తీరుపై మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోత్ హరిప్రియ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఉన్న తమను కనీసం సంప్రదించకుండా కాంతారావు పదవులు ప్రకటించారని బహిరంగం గానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇల్లెందు పట్టణ అధ్యక్షుడిగా కాంతారావు మహమ్మద్ జబ్బార్ పే రును ప్రకటించిన కొద్దిసేపటికే మాజీ ఎమ్మె ల్యే ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి హరిప్రియ నాయక్ సిలివేరు సత్యనారాయణ ను పట్టణ అధ్యక్షుడిగా నియమి స్తున్నట్లు ప్రకటించడం, మాజీ మంత్రి వనమా సైతం తన నియోజకవర్గంలో కాం తారావు కమిటీలు ప్రకటించ డాన్ని తీవ్రంగా ఖండించారు.

దీం తో ఆ పార్టీలో నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. పూర్తి స్థాయిలో పరిశీలించి కేటీఆర్ ఆదేశాలు మేరకు నూతన అధ్యక్షుల పేర్లను ఖరారు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు పేర్కొటుండగా.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని, నియోజకవర్గ ఇన్చార్జిని సంప్రదించ కుండానే నూతన అధ్యక్షుడిని ఎలా ప్రక టిస్తారంటూ మాజీ ఎమ్మెల్యేల వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో జిల్లా అధ్యక్షుడు ప్రకటించిన పేర్లు ఖరారు అవుతుందా లేదా నియోజకవర్గ ఇన్చార్జి ప్రకటించిన పేరు ఖరారు అవుతుందాని, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠ నెలకొంది. 

 మాజీ ఎమ్మెల్యేల గరం గరం..

అధ్యక్షుల నియామకంఫై గులాబీ పార్టీలో అసంతృప్త జ్వాలల రాజుకున్నాయి. జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లు గా గ్రూపు రాజకీయాలతో రచ్చకెక్కుతున్నారు. పనిచేసే వారికే అధిష్ఠానం పట్టం కట్టిందని పదవులొచ్చినవారు అంటుండగా, ఏకా భిప్రాయం లేకుండా ఎలా ఖరారు చేస్తారని అసంతృప్త వర్గాలు మండి పడుతున్నాయి. అనేక ఏళ్లగా పార్టీనే నమ్ముకొని జెండా మోసిన నేతలకు పదవులు కేటాయిం చకుండా మొండిచేయి చూపారని, పలువురు నేతలు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నా రు. ముందు వచ్చిన చెవుల కన్నా, వెనుక వచ్చిన కొమ్ములకే ప్రాధాన్యం అనే రీతిలో జిల్లా అధ్యక్షుని తీరు ఉందని మండి పడుతున్నారు.

కష్టకాలంలో పార్టీకి అండ గా నిలిచి, కాపాడుతున్న తమను నిర్ల క్ష్యం చేయడంపై మాజీ ఎమ్మెల్యేల వర్గీయులు జిల్లా అధ్యక్షునిపై విమర్శలు గుప్పి స్తున్నారు. మరోవైపు నేతలు సైతం భగ్గుమంటున్నారు. కొత్తగూడెంలో తన వర్గీయులకు జరిగిన అన్యాయాన్ని, జిల్లా అధ్యక్షుని ఒంటెద్దు పోకడలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని, కొత్తగూడెం మాజీ ఎమ్మె ల్యే వనమా చేసిన ప్రకటన చర్చినీయ అంశంగా మారింది.  

ఇంటి పోరుతో సతమతం..

నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలతో పార్టీ జిల్లాలో నాలుగు వర్గాలు, ఎనిమిది పదవులు అన్న రీతిగా మా రిందని స్పష్టమవుతున్నది. సుదీర్ఘ కాలం పనిచేసినా తమకు గుర్తింపులేదని ఒక వర్గం వాపోతుంటే.. మరోవర్గం కొత్తగా వారికి జిల్లా అధ్యక్షుడు ప్రాధాన్యం ఇస్తున్నారని పెదవి విరుస్తున్నారు. ఇదే కోవ లో మంగళవారం కొత్తగూడెం, ఇల్లందు కేంద్రంగా రెండు వర్గాల మధ్య విభేదాలు బట్టబయలయ్యా యి. మరో వైపు ప్రతి పక్షంగా పార్టీని జిల్లాలో రేగా కాంతారావు చురుకుగా నడిపిస్తున్నారని, ఆయన వర్గీ యులు అభిప్రాయ పడుతుండగా, ఆయనకు మాత్రం పార్టీలో సీనియర్ నాయకుల నుండి ప్రతిఘటన ఎదురు కావడం  కష్టంగా మారింది.

మరోవైపు ఇద్దరు మాజీల నుండి కొత్తగా తలనొ ప్పులు మొదల య్యాయి. ఇప్పటికే పినపాక నియోజక వర్గంలో కాంగ్రెస్ దాటిని ఎదుర్కొనడంలో తల మొనకలై ఉన్న కాంతా రావుకు పార్టీ నాయకులు వినిపిస్తున్న అసమ్మతి స్వరాలతో అంతర మదనంకు లోనవుతు న్నారు. జిల్లాలో అన్ని తామే అన్నట్లుగా జిల్లా అధ్యక్షుని వ్యవహార శైలి ఉందని, ఆయన తీరుతో పార్టీకి నష్టం తప్పదు అంటూ బీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. 

ఈ విభేదాలతో రానున్న స్థానిక ఎన్ని కలలో పార్టీ తీవ్రంగా నష్టపో వడం ఖాయ మని సీనియర్ నాయకులు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితిపై అధిష్ఠానం కూడా తీవ్ర అ ంతృప్తి తో ఉన్నట్లు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలతో జిల్లాలో పరిణామాలు ఎలా మార నున్నా యో అన్న సందిగ్ధం సర్వత్ర నెలకొంది.