13-11-2025 12:00:00 AM
శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి
హన్మకొండ,నవంబర్ 12 (విజయ క్రాం తి): బీసీలను కులాల వారిగా, ఇంట్లోని అన్నదమ్ములను సైతం వదలకుండా విభజించు, పాలించు అనే పద్ధతిలో అగ్రవర్ణ కులాలు కుట్రలు చేస్తున్నాయని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అ న్నారు.
బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని ఎస్డీఎల్సీ ప్రాంగణంలో కాకతీయ యూనివర్సిటీ బీసీ జేఏసీ విద్యార్థి చైర్మన్ ఆ రేగంటి నాగరాజు గౌడ్ బీసీలకు విద్యా, ఉ ద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి ఆ మోదింపజేసిన బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి, 9వ షె డ్యూల్లో చేర్పించాలనే డిమాండ్ తో నేతృత్వంలో చేపట్టిన బీసీ రిజర్వేషన్ల ధర్మ పోరా ట దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిరికొండ మధుసూదనాచారి బీసీ వి ద్యార్థి జేఏసీ చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు పూర్తి సంఘీభావం తెలిపి, దీక్షలో పాల్గొన్నా రు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కొరకు పరాయి దేశస్తుడిపై పో రాడిన భారతదేశ ప్రజలు నేడు వారి హ క్కుల కోసం భారతదేశంలోని ఆధిపత్య కులాలపై పోరాటం చేయాల్సిన దుస్థితి దా పురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపదను సృష్టించే బీసీలకు, రాజకీయ రిజర్వేషన్లు లేని కారణంగా అన్ని రంగాల్లో వెను కబడి పోతున్నారని, సంపదను సృష్టించేది బీసీలైతే,రాజ్యాధికారాన్ని చేబూనిన ఆధిపత్య కులాలు ఆ సంపదను కొల్లగొడుతు న్నాయన్నారు.
బీసీలు ఏకం కాకుండా వారిలోని ఐక్యతను విచ్చిన్నం చేస్తూ,రాజకీయ ప బ్బం గడుపుకుంటున్న ఆధిపత్య కులాల కు ట్రలను బీసీ సమాజం ఎప్పటికప్పుడు ఎండగట్టాలని బిసి జేఏసీ నేతలకు ఆయన సూ చించారు. తెలంగాణ తరహాలో ఉవ్వెత్తున లే స్తున్న బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అగ్రవర్ణాల కులాలు కుట్రలు చేస్తున్నాయని, తస్మాత్ జాగ్రత్త.! బీసీ ఉద్యమ నేతలు గ్ర హించి వారి ఉచ్చులో పడవద్దన్నారు.
అనంత రం సాయంత్రం వారికి నిమ్మరసం ఇ చ్చిన మధుసూదనాచారి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చిర్ర రాజు గౌడ్, బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా వైస్ చైర్మన్లు దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, దొడ్డిపల్లి రఘుపతి, బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.