calender_icon.png 4 December, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ లో చేరిన బద్దిపల్లి స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి

04-12-2025 06:28:30 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి తాండ్ర రాజశేఖర్, యువకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గంలో యువతీ యువకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను సర్పంచులుగా గెలిపించేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. పల్లెలు అభివృద్ధి చెందుతేనే జిల్లా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని రాజేందర్ రావు పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజేందర్రావు విజ్ఞప్తి చేశారు.