28-08-2025 01:54:31 PM
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని 36 గ్రామపంచాయతీలలో స్థానిక ఎన్నికలకు సంబందించిన గ్రామపంచాయతీ ఓటర్ లిస్ట్(Gram Panchayat Voter List) వార్డుల వారీగా గురువారం అధికారులు ప్రదర్శించారు. గ్రామపంచాయతీ కార్యాలయాలలో డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయడం, పోలింగ్ స్టేషన్ లిస్ట్ ను ప్రదర్శించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం టేకులపల్లి నందు కూడా గ్రామపంచాయతీల ఓటర్ లిస్ట్ వార్డ్ (312) వారీగా డ్రాఫ్ట్ ప్రదర్శించారు. ఎంపీడీఓ మల్లీశ్వరి, ఎంపీఓ గణేష్ గాంధీ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.