calender_icon.png 28 August, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అన్నదాతను ఆగం చేసిన వర్షాలు

28-08-2025 02:58:11 PM

2700 ఎకరాల పంట నీట మునక.. వరద తగ్గకుంటే కష్టమే.     

నిజాంసాగర్,(విజయక్రాంతి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్నదాతను(Farmers) ఆగం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, మాగి, గొర్గల్, బంజాపల్లి, బూర్గుల్, తుంకిపల్లి, కోమలంచ గ్రామాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నిజాంసాగర్ మండల పరిధిలోసుమారు 1450 ఎకరాలు, మహమ్మద్ నగర్ మండల పరిధిలో 125 0ఎకరాలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు(Agricultural officials) తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల  ద్వారా నీటి ని వదలంతో మంజీరా పరివాహ ప్రాంతా వ్యవసాయ పొలాలు నీట మునిగాయి. దీనికి తోడు కళ్యాణి వాగు నల్లవాగు సింగితం రిజర్వాయర్ నుండి వరద పోటెత్తడం తోసుమారు 2700 ఎకరాల పంట పొలాలు నీటి మునిగాయి. వరద నీది ప్రోహం తగ్గకుంటే తమ పంటను పూర్తిగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వరద ప్రహం తగ్గితే గాని పూర్తిస్థాయిలో పంట నష్టం సమాచారం  తెలిసే అవకాశం ఉంది.