calender_icon.png 28 August, 2025 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదకరంగా చెరువులు

28-08-2025 02:22:32 PM

 ఉదృతంగా పారుతున్న వాగులు.

 ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని అధికారులు సూచన.

సదాశివనగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో(Sadashivanagar Mandal) గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ పూర్తిస్థాయిలో నిండి పొంగిపొర్లుతున్నాయి. వాగులు వంకలు ప్రమాదకంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మండలంలోని బొంపల్లి గ్రామ చెరువు పూర్తిస్థాయిలో నుండి అలుగు పైనుండి నీరు ప్రవహిస్తూ చెరువుకట్టకు గండి పడింది. ఉత్తునూర్, తుక్కోజువాడి, తిమ్మాజివాడి వెళ్లే రహదారులు జలమయమై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. ఎన్నడూ లేని విధంగా కలవరాలు పెద్ద చెరువు నిండి పొంగిపొర్లడంతో పద్మాజీవాడి,కల్వరల్  రైతుల పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. రెండు గ్రామాలకు అనుకోని నీళ్లు ప్రవహిస్తున్నాయి. వాగుల వద్దకు ఎవరు వెళ్ళవద్దని, బొంపల్లి చెరువు ప్రమాదకరంగా ఉండడంతో కింది గ్రామాల ప్రజలను పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని హెచ్చరించారు.