calender_icon.png 28 August, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నేటి నుండి ఈనెల 31 వరకు ఓటర్ లిస్ట్ అభ్యంతరాల స్వీకరణ

28-08-2025 03:00:08 PM

వలిగొండ,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును గురువారం గ్రామ పంచాయతీలలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా వలిగొండ గ్రామపంచాయతీ కార్యదర్శి కందుల నాగరాజు మాట్లాడుతూ నేటి నుండి ఈనెల 30 వరకు ఓటర్ లిస్ట్ పై అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందనీ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను ఈనెల 31న జిల్లా పంచాయతీ అధికారి స్థాయిలో పరిష్కరించడం జరుగుతుందని సెప్టెంబర్ 2 న తుది ఓటర్ జాబితాను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్ బాబు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.