28-08-2025 02:24:37 PM
రేగొండ/భూపాలపల్లి(విజయక్రాంతి): జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి మండలం(Bhupalpally Mandal) మొరంచపల్లి గ్రామ శివారులోని మొరంచపల్లి వాగు వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తోంది. గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక నేతలతో కలిసి వరద ఉధృతిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాగులు, వంకలు వరద నీటితో పొంగిపొర్లడంతో నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేసి, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సహాయ చర్యలను చేపట్టాలని ఆదేశించారు.వరదల కారణంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ఎక్కడైనా ప్రమాద పరిస్థితులు ఏర్పడితే అక్కడ వెంటనే స్పందించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.