calender_icon.png 28 August, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఏరియల్ సర్వేకు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి

28-08-2025 02:50:57 PM

హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏరియల్ సర్వేకు గురువారం మధ్యాహ్నం బయల్దేరారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy Aerial Survey) పరిశీలించనున్నారు. కామారెడ్డిలో వరదలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

మంగళవారం రాత్రి నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి, మెదక్ జిల్లాలు అత్యధికంగా దెబ్బతిన్నాయి. రెండు జిల్లాల్లోని అన్ని జలాశయాలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో ఒక రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. భారీ వర్షాల ప్రభావం కారణంగా కామారెడ్డి, నిజామాబాద్ మార్గం వైపు వెళ్లే అన్ని రైళ్లను నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండ గ్రామంలో బుధవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రికార్డు స్థాయిలో 363.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లాలోని భిక్నూర్‌లో 238 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.