28-08-2025 02:26:17 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాలను గురువారం మాజీ మున్సిపల్ చైర్మన్(Former municipal chairman) రాజురా సత్యం తదితరులు సందర్శించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ఆదేశానుసారం వారు ఖానాపూర్ పట్టణంలోని వంతెన తెగిన రెంకోని వాగు, గోదావరి పరిసర ప్రాంతాలు, జెకె నగర్, హైటెక్ సిటీ ,తదితర ప్రాంతాలను సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు. స్థానిక పోలీసుల సహకారంతో ప్రజలకు తగు సూచనలు చేసి, పశువుల కాపరులు, గొర్ల పెంపకందారులు, చేప వేటలకు వెళ్లే వారిని, నదులు వాగుల వద్దకు వెళ్లకూడదని, పాత ఇంటి నిర్మాణాల్లో, కూలిపోయే స్థితిలో ఉండే నివాస గృహాల్లో సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తమకు సమాచారం అందించాలని పోలీసులు, స్థానిక నాయకులు కోరారు. వారి వెంట నాయకులు షబ్బీర్ పాష, సలీం ఖాన్, సంతోష్ ,శేషాద్రి ,చింతపండు రవి, అడ్వకేట్ వెంకట్ మహేంద్ర, కాలనీవాసులు తదితరులు ఉన్నారు.